పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:1

Notes

No Verse Added

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2:1

1
ఇశ్రాయేలు కుమారులు; రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను
2
దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
3
యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
4
మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
5
పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
6
జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
7
కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు; ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను.
8
ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను.
9
హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు రాము కెలూబై.
10
రాము అమీ్మనాదాబును కనెను, అమీ్మనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను.
11
నయస్సోను శల్మాను కనెను, శల్మా బోయజును కనెను,
12
బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను,
13
యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను
14
నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని
15
ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.
16
సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
17
అబీగయీలు అమాశాను కనెను; ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశాకు తండ్రి.
18
హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.
19
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసికొనగా అది అతనికి హూరును కనెను.
20
హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను.
21
తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను.
22
సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.
23
మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
24
కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్యయైన అబీయా అతనికి తెకోవకు తండ్రియైన అష్షూరును కనెను.
25
హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠు డగు రాము బూనా ఓరెను ఓజెము అహీయా.
26
అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను, ఇది ఓనామునకు తల్లి.
27
యెరహ్మెయేలునకు జ్యేష్ఠకుమారుడగు రాము కుమారులు మయజు యామీను ఏకెరు.
28
ఓనాము కుమారులు షమ్మయి యాదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషూరు.
29
అబీషూరు భార్యపేరు అబీహయిలు, అది అతనికి అహ్బానును, మొలీదును కనెను.
30
నాదాబు కుమా రులు సెలెదు అప్పయీము. సెలెదు సంతానములేకుండ చనిపోయెను
31
అప్పయీము కుమారులలో ఇషీ అను ఒక డుండెను, ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను, షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను,
32
షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు యోనాతాను;యెతెరు సంతానములేకుండ చనిపోయెను.
33
యోనాతాను కుమారులు పేలెతు జాజా; వీరు యెరహ్మె యేలునకు పుట్టినవారు.
34
షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి;ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు
35
షేషాను తన కుమార్తెను తన దాసుడైన యర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను.
36
అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను,
37
జాబాదు ఎప్లాలును కనెను, ఎప్లాలు ఓబేదును కనెను,
38
ఓబేదు యెహూను కనెను, యెహూ అజర్యాను కనెను,
39
అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,
40
ఎలాశా సిస్మాయీని కనెను, సిస్మాయీ షల్లూమును కనెను,
41
షల్లూము యెక మ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
42
యెర హ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రియైన మేషా, యితడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు.
43
హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.
44
షెమ యోర్కెయాము తండ్రియైన రహమును కనెను, రేకెము షమ్మయిని కనెను.
45
షమ్మయి కుమారుడు మాయోను, మాయోను బేత్సూరునకు తండ్రి.
46
కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.
47
యెహ్దయి కుమారులు రెగెము యోతాము గేషాను పెలెటు ఏయిఫా షయపు.
48
కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.
49
మరియు అది మద్మన్నాకు తండ్రియైన షయపును మక్బే నాకును గిబ్యాకు తండ్రియైన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు.
50
ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రియైన శోబాలును,
51
బేత్లెహేము తండ్రియైన శల్మాయును, బేత్గాదేరు తండ్రియైన హారే పును.
52
కిర్యత్యారీము తండ్రియైన శోబాలు కుమారులెవ రనగా హారోయే హజీహమీ్మను హోతు.
53
కిర్యత్యారీముకుమారులెవరనగా ఇత్రీయులును పూతీయులును షుమ్మా తీయులును మిష్రాయీయులును; వీరివలన సొరాతీయు లును ఎష్తాయులీయులును కలిగిరి.
54
శల్మా కుమారులెవ రనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును.
55
యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును శూకోతీయులును; వీరు రేకాబు ఇంటి వారికి తండ్రియైన హమాతువలన పుట్టిన కేనీయుల సంబంధులు.
×

Alert

×

telugu Letters Keypad References